![]() |
![]() |
.webp)
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ గా సీనియర్స్ జూనియర్స్ అన్న తేడా లేకుండా అందరూ వస్తున్నారు. ఇంద్రజ, ఆలీ, రాశి, శ్రీకాంత్ వంటి వాళ్లంతా వచ్చారు. ఇక ఇప్పుడు లయ వచ్చింది. లయ 90s హీరోయిన్. హీరో వేణుతో కలిసి "స్వయంవరం" మూవీతో ఫుల్ పాపులర్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యింది. "ప్రేమించు, మిస్సమ్మ, నీ ప్రేమకై, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం" వంటి మూవీస్ లో నటించింది. ఇక రీసెంట్ గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ షోకి వచ్చింది. ఇక నల్ల కళ్ళజోడు పెట్టుకుని శ్రీకాంత, లయ చేసిన డాన్స్ మాములుగా లేదు. "చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లయను చూడడం.
అప్పటి ఎనెర్జీ ఇప్పటికీ తగ్గలేదు" అంటూ శ్రీకాంత్ లయకి కాంప్లిమెంట్ ఇచ్చాడు. లయ ఐతే థ్యాంక్యూ అని చెప్పింది. ఇక ప్రదీప్ వచ్చి "శ్రీకాంత్ గారిలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి" అంటూ శ్రీముఖిని అడిగాడు. ఆమె వెంటనే శ్రీకాంత్ బుగ్గల్ని నొక్కుతూ "ఆయన సొట్ట బుగ్గలు" అని చెప్పింది. దాంతో శ్రీకాంత్ "బుగ్గలు ఎక్కువై సొట్టలు కనిపించడం లేదు" అనేసరికి శ్రీముఖి ఆయన రెండు బుగ్గల్ని గిల్లింది. కింద నుంచి శ్రీకాంత్ వైఫ్ ఊహ అలా చూస్తూనే ఉంది. ఇక ఈ ఈవెంట్ గా "తెలుసు కదా" మూవీ నుంచి సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా వచ్చారు. అలాగే పూజ హెగ్డే కూడా వచ్చింది. లయ మూవీస్ లో కంటే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఫ్రండ్స్ అండ్ ఫామిలీ మెంబర్స్ తో కలిసి గ్రూప్ డాన్స్ వీడియోస్ అలాగే తన పిల్లలతో ఉండే వీడియోస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి విచ్చేసింది.
![]() |
![]() |